: దేవినేని అవినాష్ కు జగన్ పరామర్శ
దేవినేని నెహ్రూ మృతిపై వైఎస్సార్సీపీ అధినేత జగన్ తన సంతాపం తెలిపారు. నెహ్రూ కుమారుడు అవినాష్ కు జగన్ ఫోన్ చేసి పరామర్శించారు. దేవినేని మృతికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ఆ కుటుంబానికి జగన్ తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. కాగా, దేవినేని నెహ్రూ మృతిపై పలు పార్టీల నేతలు తమ సంతాపం ప్రకటించారు. దేవినేనితో తమకు ఉన్న అవినాభావ సంబంధాన్ని పలువురు టీడీపీ నేతలు గుర్తు చేసుకున్నారు.