: ఆ వార్త విని నా నోట మాట రాలేదు: మండలి బుద్ధ ప్రసాద్
దేవినేని నెహ్రూ మరణ వార్త విని తన నోట మాట రాలేదని అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధ ప్రసాద్ ఆవేదన చెందారు. నెహ్రూ మృతి బాధాకరమని, వ్యక్తిగతంగా తనకు తీరని లోటని వాపోయారు. నెహ్రూ గొప్ప నాయకత్వ లక్షణాలు ఉన్న వ్యక్తి అన్నారు. కాగా, మరో టీడీపీ నేత నందమూరి హరికృష్ణ తన సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి తమ కుటుంబానికి నెహ్రూ సన్నిహితంగా ఉండేవారని అన్నారు. కాగా, దేవినేని మృతిపై మంత్రులు చినరాజప్ప, కామినేని శ్రీనివాసరావు, ఎంపీ రాయపాటి సాంబశివరావు తదితరులు సంతాపం తెలిపారు.