: దేవినేని నెహ్రూ మృతికి చంద్రబాబు, లోకేశ్ సంతాపం


టీడీపీ సీనియర్ నేత దేవినేని నెహ్రూ హఠాన్మరణంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నెహ్రూ కుటుంబ సభ్యులకు తన సంతాపం తెలియజేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, నెహ్రూ మృతి పార్టీకి, వ్యక్తిగతంగా తనకు తీరని లోటని అన్నారు. మంత్రిగా, ఎమ్మెల్యేగా ఆయన ప్రజలకు అనేక సేవలు అందించారని అన్నారు. కాగా, దేవినేని నెహ్రూ మృతిపై స్పీకర్ కోడెల శివప్రసాద్, మంత్రులు నారా లోకేశ్, ప్రత్తిపాటి పుల్లారావు, ఎంపీ కంభంపాటి రామ్మోహన్ రావు తదితరులు తమ సంతాపం వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News