: తొర్రూరులో ‘గులాబి కూలి పని’ చేయనున్న సీఎం కేసీఆర్!


‘గులాబి కూలి దినాలు’లో భాగంగా సీఎం కేసీఆర్ కూలి పని చేయనున్నారు. ఇందుకు వేదికగా పాలకుర్తి నియోజకవర్గంలోని తొర్రూరును ఎంపిక చేసినట్లు టీఆర్ఎస్ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి పర్యటనకు అన్ని ఏర్పాట్లు చేశామని విలేకరులకు తెలిపారు. వరి కోతల పనిని కేసీఆర్ చేస్తారని, ఇందుకు గాను, తొర్రూరు వ్యాపార వర్గాల నుంచి సీఎం కూలి పనికి డబ్బులు ఇప్పించే ఏర్పాట్లు జరిగినట్టు దయాకర్ రావు తెలిపారు. కనీసం, రూ.20 లక్షల కూలీ సొమ్ము వచ్చేలా చూస్తామని చెప్పారు. 

  • Loading...

More Telugu News