: ఎన్టీఆర్ గారితో లక్ష్మీపార్వతికి నేను పెళ్లి చేయడమేంటి?: సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి


ఏపీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఇటీవల ఓ యూ ట్యూబ్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో యాంకర్ అడిగిన ఓ ఆసక్తికర ప్రశ్నకు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ‘నాడు ఎన్టీఆర్ - లక్ష్మిపార్వతి పెళ్లికి మీరే పెద్దగా వ్యవహరించారట. నిజమేనా?’ అనే  ప్రశ్నకు ఆయన కడుపుబ్బ నవ్వారు. అనంతరం, సమాధానమిస్తూ, ‘ఎన్టీఆర్ గారితో లక్ష్మీపార్వతికి నేను పెళ్లి చేయడమేంటి? ఆయన దగ్గర మేమందరం చిన్నపిల్లల్లా ఉండేవాళ్లం. ఆయన వ్యక్తిగత విషయాలు మాట్లాడేంత అవకాశం మాకు లేదు.

ఎన్టీఆర్ గారు నన్ను బాగా అభిమానించేవారు. ఓసారి కర్నూల్ లో ఓ సభకు మేము వెళ్లాం. మాధవరెడ్డి గారు, ఇంద్రారెడ్డి గారు, నేను కింద కూర్చున్నాం. ఎన్టీఆర్ గారు వేదికపై ఉన్నారు. చంద్రబాబుగారితో పాటు సీనియర్లు ఇద్దరు ఎన్టీఆర్ గారి చెవిలో ఏదో చెబుతుంటే, అందుకు, ఆయన తల అడ్డంగా ఊపుతున్నారు. కొంచెం సేపటి తర్వాత ఎన్టీఆర్ మినహా స్టేజ్ పై నుంచి అందరూ కిందికి దిగిపోయారు. ఆ తర్వాత ‘లక్ష్మీ.. పైకి రా’ అని ఎన్టీఆర్ గారు పిలవగానే, లక్ష్మీపార్వతి గారు స్టేజ్ పైకి వెళ్లారు. ‘నా జీవితంలో నాకు తోడుగా నిలబడుతుంది. నాకు కాబోయే భాగస్వామి’ అని ఎన్టీఆర్ ప్రకటించారు. దీంతో, మేమంతా షాక్ తిన్నాం. ఆ తర్వాత కొన్ని రోజులకు ఎన్టీఆర్ గారు తన పెళ్లి ప్రకటన చేశారు’ అని సోమిరెడ్డి చెప్పుకొచ్చారు.

  • Loading...

More Telugu News