: తెలుగు సినిమాకు జాతీయస్థాయిలో గుర్తింపు రావడం గర్వకారణం: చిరంజీవి


తెలుగు సినిమాకు జాతీయ స్థాయిలో గుర్తింపు రావడం చాలా గర్వకారణమని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. ‘శతమానం భవతి’ చిత్రానికి జాతీయ స్థాయి అవార్డు లభించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఈ చిత్ర నిర్మాత దిల్ రాజు, దర్శకుడు సతీష్ వేగేశ్నలను ‘అల్లు అకాడమీ ఆప్ ఆర్ట్స్’ సంస్థ తరపున అల్లు అరవింద్ సన్మానించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన చిరంజీవి మాట్లాడుతూ, దిల్ రాజు, సతీష్ వేగేశ్న చేసిన కృషి వల్లే ఈ చిత్రం విజయం సాధించిందని, వారికి తన హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని అన్నారు.

  • Loading...

More Telugu News