: శ్రీనగర్ లో వేర్పాటు వాదుల నిరసన.. స్తంభించిన జనజీవనం!
కాశ్మీర్ లో యువత, సైనికుల మధ్య పరస్పర ఘర్షణలకు సంబంధించిన వీడియోల నేపథ్యంలో శ్రీనగర్ లో వేర్పాటువాదులు నిరసనకు దిగారు. బారాముల్లా జిల్లాలోని చాందూషా ప్రాంతానికి చెందిన సజ్జద్ అహ్మద్ అనే యువకుడు మృతి చెందడాన్నినిరసిస్తూ హురియత్ కాన్ఫరెన్స్ నేత సయీద్ అలీ షా జిలానీ, మిర్వాయిజ్ ఉమర్ ఫరూక్, జేకేఎల్ ఎఫ్ చీఫ్ యాసిన్ మాలిక్ ఈ రోజు బంద్ కు పిలుపు నిచ్చారు.
దుకాణాలు, పెట్రోల్ బంకులు, ఇతర వ్యాపార సముదాయాలు, ప్రజా రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. ప్రైవేటు కార్లు, క్యాబ్ లు, ఆటో రిక్షాలు మాత్రమే అక్కడక్కడా తిరుగుతున్నాయి. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ, శ్రీనగర్ లో ఎక్కడా ఆంక్షలు విధించలేదని, బారామల్లా సహా పలు సున్నిత ప్రాంతాల్లో మాత్రం సాయుధ బలగాలను మోహరింపజేశామన్నారు.