: విలాసవంతమైన ఓ ఇంటిని కొనుగోలు చేయనున్న ఏంజిలినా జోలి!


ప్రముఖ హాలివుడ్ నటి ఏంజిలినా జోలి తన భర్త బ్రాడ్ పిట్ తో విడిపోయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఏంజిలినా తన ఆరుగురు పిల్లలతో కలిసి ఉంటోంది. ఈ నేపథ్యంలో లాస్ ఏంజిల్స్ లోని ఓ విలాసవంతమైన ఇంటిని ఆమె కొనుగోలు చేయనున్నట్టు తెలుస్తోంది. సుమారు 25 మిలియన్ డాలర్లతో కొనుగోలు చేయనున్న ఈ ఇల్లు హాలీవుడ్ దర్శకుడు సెసిల్ బిదె మిల్ కి చెందింది. ఆయన చనిపోయాక ఈ ఇంటిని విక్రయానికి పెట్టారు. ఈ ఇంటిని సుమారు 2.1 ఎకరాల్లో నిర్మించారు. స్విమ్మింగ్ పూల్, రోజ్ గార్డెన్స్, రోలింగ్ లాన్, లైబ్రరీ వంటి సౌకర్యాలు ఉన్నాయి.

  • Loading...

More Telugu News