: విమానాల హైజాక్ కు కుట్ర ... ముంబై, చెన్నై, హైదరాబాద్ లో హై అలర్ట్!


ఇండియాలోని ప్రధాన విమానాశ్రయాలనుంచి బయలుదేరే విమానాలను హైజాక్ చేసేందుకు ఉగ్రవాదులు కుట్ర పన్నారన్న సెక్యూరిటీ ఏజన్సీల హెచ్చరికలతో ముంబై, చెన్నై, హైదరాబాద్ ఎయిర్ పోర్టుల్లో సెక్యూరిటీని మరింతగా పెంచారు. ఈ విమానాశ్రయాల నుంచి ప్రయాణికుల మాదిరిగా విమానాలు ఎక్కి ఉగ్రవాదులు హైజాక్ యత్నాలు చేయవచ్చని రిపోర్టులు రావడంతో ఇంటెలిజెన్స్ సంస్థలు అప్రమత్తమయ్యాయి.

ప్రయాణికులు చివరి నిమిషంలో చెకిన్ కు వచ్చేలా బయలుదేరవద్దని, సాధ్యమైనంత ముందుగానే ఎయిర్ పోర్టుకు చేరుకోవాలని, సెక్యూరిటీ అధికారులకు సహకరించాలని పలు ఎయిర్ లైన్స్ కంపెనీలు టికెట్లను కొన్న వారికి సమాచారాన్ని పంపుతున్నాయి. కాగా, జనవరి 2015లోనూ ఇదే విధమైన హైజాక్ హెచ్చరికలు వచ్చిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో కాబూల్ కు వెళుతున్న ఎయిర్ ఇండియా విమానాన్ని ఉగ్రవాదులు హైజాక్ చేయనున్నారని హెచ్చరికలు జారీ కాగా, సీఐఎస్ఎఫ్ అప్రమత్తమైంది.

  • Loading...

More Telugu News