: నేడు, రేపు ఎండలు మరింత మండుతాయి... ప్రజలకు వాతావరణ శాఖ హెచ్చరిక!


నేడు, రేపు ఎండ వేడిమి మరింత ఎక్కువగా ఉంటుందని, ప్రజలు పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. ఈ మేరకు నేటి ఉదయం ఓ ప్రకటన వెలువరిస్తూ, ఎండ వేడిమి సగటున 42 నుంచి 43 డిగ్రీల వరకూ, కొన్ని ప్రాంతాల్లో 45 డిగ్రీల వరకూ నమోదు కావచ్చని తెలిపింది. ఉత్తరాది నుంచి వీస్తున్న వేడి గాలులే ఉష్ణోగ్రత పెరగడానికి కారణమని, అత్యవసరమైతే తప్ప ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకూ బయట తిరగరాదని అధికారులు తెలిపారు. బయటకు రావాల్సి వస్తే తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

  • Loading...

More Telugu News