: మరో ఆసక్తికర విషయం... బాహుబలి-2 నిడివి ఎక్కువ!


మరో 12 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా వెండితెరలను తాకనున్న 'బాహుబలి: ది కన్ క్లూజన్' చిత్రం గురించిన మరో ఆసక్తికర విషయం బయటకొచ్చింది. ఈ చిత్రం నిడివి ఎక్కువని, పోరాట సన్నివేశాల కారణంగా తొలి భాగం సమయంతో పోలిస్తే 11 నిమిషాల వరకూ ఎక్కువగా ఉంటుందని తెలుస్తోంది. సినిమాపై ఉన్న అంచనాలు, సగటు సినీ ప్రేక్షకుడిలోని ఆసక్తిని గమనించిన తరువాత, ఈ అదనపు నిడివిని తగ్గించాల్సిన అవసరం లేదని రాజమౌళి టీమ్ భావించినట్టు తెలుస్తోంది.

బాహుబలి తొలి భాగం 2 గంటలా 39 నిమిషాల పాటు సాగగా, రెండో భాగం 2 గంటలా 50 నిమిషాలు నడవనుంది. ఇక ఈ చిత్రాన్ని సాధ్యమైనన్ని ఎక్కువ 4కే ప్రొజెక్షన్, ఐమాక్స్ థియేటర్లలో విడుదల చేయాలని కూడా టీమ్ నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. దీంతో పలు నగరాల్లో ఉన్న సింగిల్ థియేటర్లలో సినిమా స్కోప్ తెరల పొడవును, ఈ చిత్రం కోసం మరింగా పెంచనున్నట్టు సమాచారం.

  • Loading...

More Telugu News