: నయనతారతో వంద సినిమాలు తీయొచ్చంటున్న డైరక్టర్


తీరైన హావభావాలతో అనతికాలంలోనే మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్న అందాలతార నయనతార. టాలీవుడ్ కింగ్ నాగార్జున జతగా ప్రస్తుతం ఆమె నటించిన గ్రీకువీరుడు శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన దశరథ్ ఓ ఇంటర్వ్యూలో నయనతారపై ప్రశంసల వర్షం కురిపించాడు. నయనతారలో మానవీయత ఎక్కువేనని దశరథ్ చెప్పుకొచ్చాడు. షూటింగ్ సందర్భంగా ఓ అసిస్టెంట్ డైరక్టర్ కు కష్టమొస్తే నయనతార నేనున్నానంటూ ముందుకొచ్చిందని దశరథ్ గుర్తు చేసుకున్నాడు. అలాంటి దయాగుణం ఉన్న హీరోయిన్ తో వంద సినిమాలైనా తీయొచ్చని అంటున్నాడీ దర్శకుడు.

  • Loading...

More Telugu News