: కెప్టెన్ జహీర్ నమ్మకాన్ని నిలబెట్టిన ఢిల్లీ డేర్ డెవిల్స్ బ్యాట్స్ మన్


ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టు కెప్టెన్ జహీర్ ఖాన్ నమ్మకాన్ని ఆ జట్టు బ్యాట్స్ మన్ నిలబెట్టారు. టాస్ గెలిచిన జహీర్ పిచ్ డ్రైగా ఉందని, తమ ఆటగాళ్లు పరుగులు సాధించాలంటే ముందే బ్యాటింగ్ తీసుకుంటామని తెలిపాడు. దీంతో బ్యాటింగ్ ప్రారంభించిన ఢిల్లీ డేర్ డెవిల్స్ కు సొంత మైదానంలో ఓపెనర్లు సంజు శాంసన్ (15), శామ్ బిల్లింగ్స్ (55) శుభారంభం ఇచ్చారు. సంజు శాంసన్ అంచనాలు అందుకోకపోవడంతో క్రీజులోకి వచ్చిన కరుణ్ నాయర్ (0) కూడా దారుణంగా విఫలమయ్యాడు.

అనంతరం శ్రేయస్ అయ్యర్ (22) రిషబ్ పంత్ (15) ఫర్వాలేదనిపించారు. కోరె ఆండర్సన్ (39), క్రిస్ మోరిస్ (16), కుమ్మిన్స్ (11) చివర్లో ఫోర్లు, సిక్సర్లతో మెరుపులు మెరిపించడంతో ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ బౌలర్లలో వరుణ్ ఆరోన్ రెండు వికెట్లతో రాణించగా, సందీప్ శర్మ, మోహిత్ శర్మ, అక్షర్ పటేల్, కరియప్ప చెరొక వికెట్ తీసి ఆకట్టుకున్నారు. దీంతో, కాసేపట్లో 189 పరుగుల విజయ లక్ష్యంతో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ బ్యాటింగ్ ప్రారంభించనుంది. 

  • Loading...

More Telugu News