: సన్ రైజర్స్ కు వరుస ఓటములు...విజయం సాధించిన కోల్ కతా నైట్ రైడర్స్


కోల్ కతా వేదికగా జరిగిన మ్యాచ్ లో 17 పరుగుల తేడాతో సన్ రైజర్స్ హైదరాబాదుపై కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు విజయం సాధించింది. టాస్ ఓడి బ్యాటింగ్ ప్రారంభించిన కోల్ కతా నైట్ రైడర్స్ జట్టులో ఓపెనర్ సునీల్ నరైన్ (6), కెప్టెన్ గౌతమ్ గంభీర్ (15) వికెట్లు కోల్పోయిన కోల్ కతాను కీపర్ రాబిన్ ఊతప్ప (68) అర్థసెంచరీతో ఆదుకోగా, అతనికి అద్భుతమైన ఫాంలో ఉన్న మనీష్ పాండే (46) ఆకట్టుకున్నాడు. వారికి యూసఫ్ పఠాన్ (20) సహకరించాడు. యాదవ్ (4), గ్రాండ్ హోం (0), వోక్స్ (1) విఫలమయ్యారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది.

అనంతరం 173 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన సన్ రైజర్స్ హైదరాబాదు ఆటగాళ్లు దారుణంగా విఫలమయ్యారు. వార్నర్ (26), ధావన్ (23) పరుగులు చేసేందుకు ఇబ్బంది పడ్డారు. దీంతో ఆరంభంలోనే బంతులు తినేశారు. అనంతరం హెన్రిక్ (13) విఫలం కాగా, యువరాజ్ సింగ్ (26) ఫర్వాలేదనిపించినా, జట్టును గెలిపించలేకపోయాడు దీపక్ హుడా (13), కట్టింగ్ (15) మరోసారి విఫలమయ్యారు. బిపుల్ శర్మ (21) చివర్లో ఫర్వాలేదనిపించినా పీకలమీదకి వచ్చిన తరువాత స్పందించాడు. నమన్ ఓజా (11) సింగిల్స్ తో జాప్యం చేశాడు. దీంతో సన్ రైజర్స్ హైదరాబాదు జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. దీంతో కోల్ కతా 17 పరుగుల తేడాతో విజయం సాధించింది. సన్ రైజర్స్ వరుస ఓటములతో పాయింట్ల పట్టికలో దిగజారింది. 

  • Loading...

More Telugu News