: భువనేశ్వర్ లో ప్రధాని రోడ్ షో...పోటెత్తిన జనం


ఒడిశాలో అధికారం సొంతం చేసుకునేందుకు బీజేపీ ప్రణాళికలు ప్రారంభించింది. ఒడిశాలో జరుగుతున్న కార్యవర్గ సమావేశాలకు ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు హాజరయ్యారు. ఈ సందర్భంగా భువనేశ్వర్ ఎయిర్ పోర్టులో ల్యాండ్ అయిన అనంతరం ఆయన రోడ్ షో నిర్వహిస్తూ కార్యవర్గ సమావేశాల ప్రాంగణానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు బీజేపీ రాష్ట్ర నేతలు ఘన స్వాగతం పలికారు. రోడ్డుకిరువైపులా భారీ ఎత్తున జనం నిలబడి ఆయనకు స్వాగతం పలుకుతూ అభివాదం చెప్పారు. ప్రధానిని చూసేందుకు పలువురు ఉత్సాహం చూపారు. దీంతో బీజేపీ వర్గాల్లో హర్షం వ్యక్తమవుతోంది.  

  • Loading...

More Telugu News