: లేదు సర్...మీరనుకున్నట్టు ఇది ఆ సినిమాలో గెటప్ కాదు: అభిమానికి అమితాబ్ సమాధానం
ప్రముఖ బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ బచ్చన్ కు సంబధించిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఇందులో తెల్లని గడ్డం, కాషాయ రంగు తలపాగాలో ఆయన కొత్తగా కనిపిస్తున్నారు. గతంలో చాలా సినిమాల్లో గడ్డంతో నటించినప్పటికీ సిక్కు తలపాగాతో కనిపించడంతో ఆయన కొత్తగా అనిపిస్తున్నారు. ఈ ఫోటోను ఆయన తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేస్తూ ‘నా సిక్కు అవతారం చూసి స్వర్గంలో ఉన్న మా అమ్మమ్మ అమర్ కౌర్ సోధి, తాతయ్య ఖజన్ సింగ్ సురిలు కూడా ఆనందిస్తారు...ఇవి నా సిక్కు మూలాలు’ అని ఆయన ట్వీట్ చేశారు.
ఇది సోషల్ మీడియాలో ప్రస్తుతం ఆయన నటిస్తున్న ‘థగ్స్ ఆఫ్ హిందుస్థాన్’ సినిమాలో గెటప్ చిత్రాలంటూ పొరబడిన ఓ అభిమాని...ఆ సినిమాలో సిక్కు లుక్ లో అమితాబ్ అంటూ అత్యుత్సాహంతో ట్వీట్ చేశారు. దీనిని గుర్తించిన అమితాబ్ వెంటనే స్పందిస్తూ, ‘లేదు సర్. ఇది సినిమాలోది కాదు, ఓ ప్రకటనలోది. ఈరోజే చిత్రీకరిచాం’ అని ఆయనకు వివరించారు. దీంతో అమితాబ్ అంత పెద్ద నటుడు అభిమానికి ఇచ్చిన సమాధానం పట్ల అభిమానులు ఫిదా అయిపోతున్నారు.