: కాలేజీ టూర్లో విషాదం.. 8 మంది ఇంజినీరింగ్ విద్యార్థుల మృతి
కాలేజీ నుంచి టూర్‌కి వెళ్లి బీచ్‌లో సరదాగా స్నానానికి దిగిన ఎనిమిది మంది విద్యార్థులు మృతి చెందిన ఘటన మహారాష్ట్రలోని సింధుదుర్గ్ జిల్లాలోని వైరీ బీచ్‌లో చోటుచేసుకుంది. మృత్యువాత పడ్డ విద్యార్థులంతా కర్ణాటకకు చెందినవారే. కర్ణాటకలోని బెల్గాం ప్రాంతంలోగల మరాఠ ఇంజినీరింగ్ కాలేజీ నుంచి మొత్తం 40 మంది విద్యార్థులు విహారయాత్ర కోసం మహారాష్ట్ర చేరుకున్నారు. వైరీ తీరాన వారంతా గడుపుతుండగా వారిలో ఎనిమిది మంది విద్యార్థులు స్నానానికి దిగి గల్లంతయ్యారు. అనంతరం వారి మృతదేహాలు సముద్రంలో తేలుతూ కనిపించాయి.