: నేనేం తప్పు మాట్లాడలేదు.. ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకోండి: చంద్రబాబుకు శివప్రసాద్ సూచన


మంత్రివర్గంలో దళితులకు సరైన ప్రాధాన్యత కల్పించలేదంటూ టీడీపీ ఎంపీ శివప్రసాద్ చేసిన వ్యాఖ్యలు కలకలం సృష్టించాయి. ఈ వ్యాఖ్యలపై చంద్రబాబు సైతం సీరియస్ అయ్యారు. వ్యక్తిగత అజెండాతో మాట్లాడుతూ, పార్టీకి ఇబ్బందులు కలిగిస్తే ఊరుకోనని ఆయన హెచ్చరించారు. ఈ నేపథ్యంలో శివప్రసాద్ స్పందించారు. తాను ఎప్పుడూ తప్పుగా మాట్లాడలేదని ఆయన చెప్పారు. దళితులకు న్యాయం చేయమని మాత్రమే అడిగానని అన్నారు. ప్రజలంతా ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలని సూచించారు. ఎంపీలకు చంద్రబాబు సమయం ఇవ్వడం లేదని అన్నారు. ఢిల్లీకి వచ్చినప్పుడు కూడా ఆయనతో మాట్లాడేందుకు ఎంపీలకు అవకాశం రావడం లేదని చెప్పారు. ఓ న్యూస్ ఛానల్ తో శివప్రసాద్ మాట్లాడుతూ, పైవ్యాఖ్యలు చేశారు. 

  • Loading...

More Telugu News