: చిత్తూరు మేయర్ గా కటారి హేమలత ఏకగ్రీవంగా ఎన్నిక
చిత్తూరు నగర మేయర్ గా టీడీపీ అభ్యర్థి కటారి హేమలత ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జిల్లా కలెక్టర్ సిద్ధార్థ్ జైన్ అధ్యక్షతన కౌన్సిల్ సమావేశం జరిగింది. మేయర్ ఎన్నికకు సంబంధించి, 33వ డివిజన్ కార్పొరేటర్ కటారి హేమలత నుంచి మాత్రమే నామినేషన్ దాఖలైంది. దీంతో, మేయర్ గా ఆమె ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గతంలో చిత్తూరు మేయర్ కటారి అనురాధ దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. దీంతో, ఆమె స్థానంలో ఆమె కోడలు హేమలత మేయర్ గా ఎన్నికయ్యారు.