: అప్పుడు నాకు కూడా బాగా ఏడుపు వచ్చేసింది... తలెత్తలేకపోయాను: రమా రాజమౌళి
బాహుబలి రెండో భాగం ప్రీ రిలీజ్ ఫంక్షన్ సందర్భంగా వేదికపై సంగీత దర్శకుడు కీరవాణి ‘ఎవ‌్వడంట.. ఎవ్వడంటా.. బాహుబలి తీసింది.. మా పిన్నికి పుట్టాడు ఈ నందిగాని నంది’ అంటూ దర్శకుడు రాజమౌళిని ఉద్దేశిస్తూ పాట పాడిన విషయం తెలిసిందే. ఆ సమయంలో రాజమౌళి భావోద్వేగానికి గురై, కన్నీరు కూడా పెట్టుకున్నారు. అయితే, ఆ సమయంలో అక్కడే ఉన్న తాను కూడా ఎంతో భావోద్వేగానికి గురయ్యానని రాజమౌళి సతీమణి రమా తెలిపారు.
‘మా పిన్నికి పుట్టాడు ఈ నందిగాని నంది’ అనగానే అప్పుడు తనకు తన అత్తమ్మ గుర్తుకొచ్చిందని అన్నారు. అప్పుడు తనకు ఏడుపు వచ్చేసిందని, అస్సలు తలెత్తలేకపోయానని అన్నారు. ఎంతో ఎమోషన్ అయిపోయానని చెప్పారు. ఆ వేదికపైకి ఇక తలెత్తి చూడలేదని, అనంతరం ఇంటికి వెళ్లి యూ ట్యూబ్‌లో ఆ వీడియోను చూశానని, వేదికపై స్క్రీన్‌పై తన అత్తమ్మ ఫొటో కూడా ఉందని తాను అప్పుడు గ్రహించానని తెలిపారు.