: పెయిన్ కిల్లర్లు వేసుకుని షూటింగ్ కు హాజరవుతున్న నయనతార!
స్టార్ హీరోయిన్ నయనతార ప్రస్తుతం 'జయం' మోహన్ దర్శకత్వంలో శివకార్తికేయన్ సరసన 'వేలైక్కారన్' సినిమాలో నటిస్తోంది. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ లో ఆమె స్టేజిపై నుంచి కింద పడిపోయింది. ఈ ప్రమాదంలో ఆమె వెన్నుకు దెబ్బతగిలింది. దీంతో, కొన్ని వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని నయన్ కు డాక్టర్లు సూచించారు. అయితే, తాను రెస్ట్ తీసుకుంటే షూటింగ్ ఆగిపోతుందనే భావనతో... పెయిన్ కిల్లర్లను వేసుకుంటూ షూటింగ్ కు హాజరవుతోంది. నయనతార చూపిస్తున్న ప్రొఫెషనలిజంను చూసి యూనిట్ సభ్యులు సైతం ఆశ్చర్యపోతున్నారు.