: శ్రీనగర్ లోక్ సభ ఉపఎన్నికలో ఫరుక్ అబ్దుల్లా ముందంజ


జమ్ముకశ్మీర్ లోని శ్రీనగర్ లోక్ సభ ఉపఎన్నిక కౌంటింగ్ ఈ ఉదయం ప్రారంభమైంది. ఇప్పటి వరకు జరిగిన లెక్కింపు ప్రకారం నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూక్ అబ్దుల్లా ముందంజలో ఉన్నారు. తన ప్రత్యర్థి పీడీపీ అభ్యర్థి నజీర్ అహ్మద్ ఖాన్ కంటే 700కు పైగా ఓట్ల మెజారిటీతో ఉన్నారు. ఈ లోక్ సభ ఉపఎన్నికలో జమ్ముకశ్మీర్ చరిత్రలోనే అతి తక్కువ పోలింగ్ నమోదైంది. కేవలం 7 శాతం మంది ఓటర్లు మాత్రమే ఓటు వేశారు. 2014 లోక్ సభ ఎన్నికల్లో ఇక్కడ నుంచి ఫరూక్ అబ్దుల్లా ఓడిపోయారు. పీడీపీ అభ్యర్థి హమీద్ గెలిచారు. 

  • Loading...

More Telugu News