: పట్టాలు తప్పిన రైలు... 15 మందికి గాయాలు


ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ నుంచి లక్నో వెళ్తున్న రాజ్యరాణి ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పడంతో 15 మందికి గాయాలయ్యాయి. రాంపూర్‌లోని కోసి బ్రిడ్జ్‌ సమీపంలో చోటు చేసుకున్న ఈ ప్ర‌మాద స్థ‌లికి చేరుకున్న పోలీసులు గాయాలపాల‌యిన వారిని ఆసుప‌త్రికి త‌ర‌లించి, స‌హాయ‌క చ‌ర్యలు చేప‌డుతున్నారు. ఈ ప్రమాదంలో రాజ్యరాణి ఎక్స్‌ప్రెస్‌ కు చెందిన 8 బోగీలు పట్టాలు తప్పాయని చెప్పారు. ఈ ప్రమాదం కారణంగా ఆ మార్గంలో కొన్ని రైళ్ల రాక‌పోక‌ల‌కు అంత‌రాయం ఏర్ప‌డి ఆలస్యంగా నడుస్తున్నాయి. ఈ ఘ‌ట‌న‌పై పూర్తి స‌మాచారం తెలియాల్సి ఉంది.

  • Loading...

More Telugu News