: ప్రపంచ పటం నుంచి ఉత్తరకొరియా అదృశ్యమైనా ఆశ్చర్యం లేదంటున్న నిపుణులు!


అమెరికా నుంచి ఊహించని ప్రతిఘటన ఎదురవడంతో ఇప్పుడు ఉత్తరకొరియా ఏం చేస్తుంది? అనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. అమెరికా మీద దాడి చేస్తుందా? అని కొందరు ఆలోచిస్తున్నారు. అయితే, అలా జరగకపోవచ్చని... దక్షిణకొరియాపై దాడి చేసే అవకాశం ఉందని కొందరు నిపుణులు చెబుతున్నారు. ఉత్తరకొరియా విషయానికి వస్తే... దక్షిణకొరియాపై దాడి చేస్తే అమెరికాపై దాడి చేసినట్టే లెక్క. ఉత్తరకొరియాకు లాభించే అంశం ఏమిటంటే... దక్షిణ కొరియా రాజధాని సియోల్ ఇరుదేశాల మధ్య ఉన్న సరిహద్దుకు సమీపంలోనే ఉంటుంది. అంతేకాదు, దేశ జనాభాలో 45 శాతం మంది సియోల్, దాని పరిసర ప్రాంతాల్లోనే ఉంటారు. ఈ నేపథ్యంలో, సియోల్ ను నాశనం చేస్తే దేశం మొత్తన్ని నాశనం చేసినట్టే.

కొన్ని దశాబ్దాలుగా అమెరికా అండతో దక్షిణకొరియా ఎంతో ప్రగతిని సాధించింది. ప్రపంచ అగ్రగామి సంస్థలైన శ్యామ్ సంగ్, ఎల్ జీ, హ్యుండాయ్ తదితర కంపెనీలన్నీ ఈ దేశానివే. ఆటోమొబైల్స్, ఎలక్ట్రానిక్స్, ఇంజినీరింగ్, కన్ స్ట్రక్షన్, మైన్స్ రంగాల్లో ఈ దేశం ఎంతో అభివృద్ధిని సాధించింది. దక్షిణకొరియా ప్రజల తలసరి ఆదాయం కూడా చాలా ఎక్కువ. 2013 గణాంకాల ప్రకారం తలసరి ఆదాయం 25,976 డాలర్లు. ఇప్పుడు ఇది మరింత పెరిగి ఉంటుంది.

ఈ నేపథ్యంలో, దక్షిణకొరియాపై ఉత్తరకొరియా దాడికి పాల్పడితే దాని ప్రభావం ఎన్నో దేశాలపై ఉంటుంది. ముఖ్యంగా అమెరికాకు కూడా చాలా నష్టం. దీంతో, అమెరికా నుంచి ఉత్తరకొరియాకు తీవ్ర ప్రతిఘటన ఎదురవుతుంది. అది ఎంత తీవ్రంగా ఉంటుందంటే... ప్రపంచ పటం నుంచి ఉత్తరకొరియా కనుమరుగైనా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఈ విషయాన్ని అంతర్జాతీయ నిపుణులు చెపుతున్నారు. 

  • Loading...

More Telugu News