: తీవ్రమైన ఒత్తిడిని తట్టుకోలేకే రాజీనామా చేశా: మనోహర్ పారికర్
భారత రక్షణ శాఖ మంత్రి పదవికి రాజీనామా చేసి, గోవా ముఖ్యమంత్రిగా మనోహర్ పారికర్ బాధ్యతలను స్వీకరించిన సంగతి తెలిసిందే. అయితే, అత్యంత కీలకమైన రక్షణ మంత్రి పదవికి రాజీనామా చేయడానికి గల కారణాన్ని ఆయన వెల్లడించారు. తీవ్రమైన ఒత్తిడితోనే తాను రాజీనామా చేశానని చెప్పారు. ఒత్తిడికి గురి కావడానికి కశ్మీర్ అంశం కూడా ఒకటని తెలిపారు. తాను పని చేయడానికి ఢిల్లీ సరైన స్థానం కాదని... అందుకే గోవాకు తిరిగి వచ్చేశానని చెప్పారు. కశ్మీర్ సమస్యను పరిష్కరించడం అంత సామాన్యమైన విషయం కాదని... సుదీర్ఘమైన ప్రణాళికతోనే అది సాధ్యమవుతుందని తెలిపారు.