: బాలయ్య కనిపించడం లేదన్న ఫిర్యాదుకు టీడీపీ స్పందన
హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ కనిపించడం లేదంటూ వైసీపీ నేతలు నిన్న హిందూపురం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై నియోజకవర్గ టీడీపీ కోఆర్డినేటర్ కృష్ణమూర్తి స్పందించారు. నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులను చూసి ఓర్వలేకే వైసీపీ నేతలు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. బాలయ్య ప్రతి రోజు ఫోన్ ద్వారా సమస్యలను తెలుసుకుని, వాటిని ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నారని చెప్పారు. బాలయ్య ఆదేశాలతో నియోజకవర్గంలోని ప్రజాప్రతినిధులు, అధికారులు అభివృద్ధి కార్యక్రమాలలో పాలుపంచుకుంటున్నారని తెలిపారు. నియోజకవర్గం అభివృద్ధిలో వైసీపీ నేతలు కూడా భాగస్వాములు కావాలని సూచించారు.