: టీడీపీ ఎంపీ శివప్రసాద్ కు కౌంటర్ ఇచ్చిన మంత్రులు!
ఇటీవలి మంత్రి వర్గ విస్తరణలో ఎస్పీలకు తీవ్ర అన్యాయం జరిగిందని, ఎస్సీలను అన్ని రకాలుగా మోసం చేస్తున్నారని చిత్తూరు టీడీపీ ఎంపీ శివప్రసాద్ వ్యాఖ్యలు చేయడం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై ఏపీ మంత్రులు మండిపడుతున్నారు. వ్యక్తిగత అజెండాతో మాట్లాడటం సరికాదని, రాజకీయ విమర్శలు మానుకోకపోతే తగిన విధంగా బుద్ధి చెబుతామని మంత్రి నక్కా ఆనంద్ బాబు అన్నారు. దళితుల అభివృద్ధి, సంక్షేమం కోసం టీడీపీ చిత్తశుద్దితో పని చేస్తోందని, దళితవాడల్లో వేల కోట్ల రూపాయలతో సిమెంటు రోడ్ల నిర్మాణం జరుగుతోందని అన్నారు. తెలిసీతెలియకుండా మాట్లాడటం, రాజకీయ విమర్శలు చేయడం మానుకోవాలని హితవు పలికారు. మంత్రి పదవులు ఇవ్వడం అధిష్ఠానం ఇష్టమని మరో మంత్రి అమర్ నాథ్ రెడ్డి అన్నారు.