: పోలవరంలో అగ్నిప్రమాదం.. రూ.60 లక్షల విలువ చేసే ఎక్సావేటర్ దగ్ధం!


పశ్చిమగోదావరి జిల్లా పోలవరం ప్రాజెక్టు పనుల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. రూ.60 లక్షల విలువ చేసే భారీ ఎక్సావేటర్ లో మంటలు చెలరేగడంతో సగంపైనే కాలిపోయింది. ఎక్సావేటర్ కు విద్యుత్ సరఫరా చేసే జనరేటర్ లో షార్ట్ సర్క్యూట్ జరిగింది. దీంతో, ఎక్సావేటర్, అందులోని జనరేటర్లలో ఒకటి పూర్తిగా దగ్ధమయ్యాయి. ప్రాజెక్టు ప్రాంతంలో ఉన్న నీటి ట్యాంకర్ల సాయంతో మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు.

కాగా, గత సెప్టెంబర్ లో ఈ ఎక్సావేటర్ ను సీఎం చంద్రబాబు ప్రారంభించారు. దీని ద్వారా రోజుకు 25 నుంచి 30 వేల క్యూబిక్ మీటర్ల తవ్వకాలు జరపవచ్చు. ప్రాజెక్టులో పనులు వేగవంతం చేసే నిమిత్తం త్రివేణి కంపెనీ ఈ ఎక్సావేటర్ ను ఆస్ట్రేలియా నుంచి తీసుకువచ్చింది.


  • Loading...

More Telugu News