: క్రికెట్ బంతి తలకు తగిలి నాలుగో తరగతి విద్యార్థి మృతి
క్రికెట్ బంతి తలకు తగలడంతో నాలుగవ తరగతి చదువుతున్న విద్యార్థి లీలాధర్ మృతి చెందిన సంఘటన గుంటూరు జిల్లా బాపట్ల మండలం కొండుభట్ల వారి పాలెంలో జరిగింది. నందిరాజు పేట ప్రైమరీ పాఠశాలకు చెందిన లీలాధర్ నిన్న సాయంత్రం తన మిత్రులతో కలిసి క్రికెట్ ఆడుతున్నాడు. ఈ క్రమంలో అతని తలకు క్రికెట్ బంతి తగిలింది. దీంతో, అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. అక్కడ ఉన్న పిల్లల సమాచారం మేరకు స్థానికులు సంఘటనా స్థలానికి వెళ్లారు. లీలాధర్ ను స్థానిక ప్రభుత్వాసుపత్రికి తీసుకువెళ్లారు. అయితే, అప్పటికే లీలాధర్ మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు.