: మంత్రిగా భూమా అఖిలప్రియ తొలి సంతకం ఈ ఫైల్ మీదే
ఏపీ పర్యాటక శాఖ మంత్రిగా భూమా అఖిలప్రియ నేడు బాధ్యతలను స్వీకరించారు. మంత్రి హోదాలో పేద కళాకారులకు ఆర్థిక సాయం చేసే ఫైల్ పై ఆమె తొలి సంతకం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, విశాఖపట్నం నుంచి అరకు వరకు పర్యాటక రైలును ప్రారంభించాలనే ఆలోచన ఉన్నట్టు తెలిపారు. టెంపుల్ టూరిజానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు. ఏపీటీటీసీ యాప్ ను ప్రారంభించారు.