: ప్రియురాలిని పెళ్లాడిన కరిష్మాకపూర్ మాజీ భర్త


బాలీవుడ్ నటి కరిష్మా కపూర్ మాజీ భర్త సంజయ్ కపూర్ తన ప్రియురాలు ప్రియా సచ్ దేవ్ ను పెళ్లాడాడు. ఢిల్లీలో వీరి వివాహం నిన్న జరిగింది. ఈ కార్యక్రమానికి వధూవరుల కుటుంబసభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. ఈ జంట మరోసారి న్యూయార్క్ లో పెళ్లి చేసుకోబోతోంది. కొన్నేళ్ల క్రితం ప్రియ సచ్ దేవ్ తో సంజయ్ కపూర్ కు న్యూయార్క్ లో పరిచయం అయింది. గత ఐదేళ్లుగా వీరి బంధం కొనసాగుతోంది. సంజయ్ కు ఇది మూడో పెళ్లి కాగా, ప్రియకు ఇది రెండో పెళ్లి. గతంలో సంపన్నుడైన విక్రమ్ చట్వాల్ ను ప్రియ పెళ్లాడింది. ఆ తర్వాత వీరి వివాహ బంధం ముగిసింది. సంజయ్ కూడా గత ఏడాది కరిష్మాతో విడాకులు తీసుకున్నాడు. దీంతో, 13 ఏళ్ల వీరి బంధానికి తెరపడింది. మరోవైపు కరిష్మా కపూర్ కూడా వ్యాపారవేత్త సందీప్ తోష్నీవాల్ తో సన్నిహితంగా ఉంటోందన్న వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. 

  • Loading...

More Telugu News