: విరాట్ కోహ్లీ మరోసారి నిర్ధారించేశాడు...ఈసారి ఏకంగా ఇన్ స్టా గ్రాం డీపీ మార్చేశాడు
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మరోసారి తన ప్రేమను నిర్ధారించాడు. భుజం గాయం నుంచి కోలుకున్న విరాట్ కోహ్లీని పరామర్శించేందుకు అనుష్క వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ కలయికలో ఏం జరిగిందో కానీ... తన ఇన్ స్టా గ్రాం డీపీని మార్చేశాడు. ఇంత వరకు తన ఇన్ స్టా గ్రాం ఖాతాలో కోహ్లీ ఒక్కడి ఫోటో మాత్రమే ఉండేది. తాజాగా జరిగిన యువరాజ్ సింగ్ వివాహం సందర్భంగా ప్రియురాలు అనుష్కతో కలిసి ఉండగా తీసిన ఫోటోను తన ఇన్ స్టా గ్రాం డీపీగా పెట్టుకున్నాడు.
కాగా, చాలా రోజుల వరకు తన ప్రేమను ఎవరికీ తెలియకుండా సీక్రసీ మెయింటైన్ చేసిన ఈ జంట...ఇక లాభం లేదనుకుని ప్రేమను బయటపెట్టారు. ప్రేమ పక్షుల్లా తిరుగుతుండడంతో కోహ్లీ విఫలమవుతున్నాడని క్రికెట్ అభిమానులు తీవ్ర విమర్శలు చేశారు. అనంతరం కోహ్లీ ఆమెను వెనకేసుకొచ్చాడు. ఆ తరువాత సుల్తాన్ సినిమాలో నటించొద్దన్నా అనుష్క పట్టించుకోలేదని వారిద్దరూ కొంత కాలం ఎడమొహం పెడ మొహంగా ఉన్నారు. అయితే అనుష్క శర్మ సోదరుడి జోక్యంతో మళ్లీ కలిసిపోయిన వారిద్దరూ ప్రేమపక్షులైపోయారు. బహిరంగంగా తిరగకపోయినా...విదేశీ టూర్లు, ఫంక్షన్లు ఇలా వివిధ సందర్భాల్లో కలుసుకుని ఆనందం పంచుకుంటున్నారు.