: మోహన్ బాబుకు రజనీకాంత్ సరికొత్త సలహా!


సినీ పరిశ్రమలో రజనీకాంత్, మోహన్ బాబుల మధ్య ఉన్న అనుబంధం చాలా ప్రత్యేకమైంది. వీరిద్దరి మధ్య విడదీయలేని స్నేహం ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. రజనీ ఏదైనా సలహా ఇస్తే మోహన్ బాబు తుచ తప్పకుండా పాటిస్తారు. రజనీ అల్లుడు ధనుష్ దర్శకత్వం వహించిన 'పవర్ పాండి' అనే సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఓ 60 ఏళ్ల వృద్ధుడు తన జీవితంలో ఏం కోరుకుంటాడు? అనే కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కించారు. ప్రధాన పాత్రలో రాజ్ కిరణ్ నటించారు.

ఈ సినిమాను రజనీ కోసం ప్రత్యేకంగా చూపించగా... సినిమా మొత్తాన్ని చూసిన తర్వాత తన అల్లుడిని ప్రశంసల్లో ముంచెత్తారు రజనీ. ఈ సినిమా అనేక సంవత్సరాల వరకు పేరు నిలబెడుతుందని... మరో పదేళ్ల వరకు మరో సినిమాకు దర్శకత్వం వహించవద్దని అల్లుడికి రజనీ సూచించారట. అంతేకాదు, తన మిత్రుడు మోహన్ బాబును కూడా సినిమా ప్రదర్శనకు పిలిచారని... ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేసి, అందులో నటించమంటూ తన మిత్రుడికి సూచించారని చెబుతున్నారు. మరి, మోహన్ బాబు ఈ సినిమా చేస్తారా? లేదా? అనే విషయం తెలియాలంటే కొంత కాలం వేచి చూడాలి. 

  • Loading...

More Telugu News