: నల్లధనాన్ని వెలికి తీసేందుకు మరోసారి 'ఆపరేషన్ క్లీన్ మనీ'


దేశంలో ఉన్న నల్లధనాన్ని వెలికి తీసేందుకు మరోసారి ఆపరేషన్ క్లీన్ మనీని ప్రయోగించింది కేంద్ర ప్రభుత్వం. రెండో దశ ఆపరేషన్ ను నిన్నటి నుంచి ఆదాయపు పన్ను శాఖ ప్రారంభించింది. ఇందులో భాగంగా 60 వేల మందికి నోటీసులు జారీ చేసేందుకు సిద్ధమైంది.

పెద్ద నోట్లను రద్దు చేసిన అనంతరం విలువైన ఆస్తుల కొనుగోళ్లకు సంబంధించిన లావాదేవీలు దాదాపు 6 వేలకు పైగా జరిగాయని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు వెల్లడించింది. అంతేకాదు, 2016 నవంబర్ 9 నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి 28 వరకు రూ. 9,334 కోట్లకు పైగా వెల్లడించని ఆదాయాన్ని గుర్తించినట్టు తెలిపింది. దీనికితోడు, పెద్ద మొత్తంలో నగదును డిపాజిట్ చేసిన వారిని కూడా గుర్తించినట్టు అధికారులు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News