: శభాష్ ట్రంప్.. అమెరికా అధ్యక్షుడిపై కురుస్తున్న ప్రశంసల జల్లు
ఆఫ్ఘనిస్థాన్ లో అతి పెద్ద బాంబును ప్రయోగించి ఐఎస్ఐఎస్ స్థావరాలను నాశనం చేసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై ఆ దేశ నేతలు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. నిన్న రాత్రి అతిపెద్ద అణ్వస్త్రేతర బాంబును అమెరికా ప్రయోగించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, అమెరికా నేతలు మాట్లాడుతూ, ఈ దాడితో ఉగ్రవాదులకు స్పష్టమైన సందేశం ఇచ్చినట్టు అయిందని అన్నారు. ఆఫ్ఘనిస్థాన్ తో పాటు ఇతర ప్రాంతాల్లో ఉన్న ఐసిస్, ఇతర ఉగ్రవాద సంస్థలను నాశనం చేసేందుకు అమెరికా ఎంత పట్టుదలతో ఉందో అన్న విషయం ఈ దాడితో అర్థమవుతోందని సెనేటర్ జిమ్ ఇన్ హోఫే తెలిపారు. ఉగ్రవాద నిర్మూలనకు ట్రంప్ కట్టుబడి ఉన్నారని కొనియాడారు. ఇదే సమయంలో అమెరికా సైన్యంపై కూడా ప్రశంసలు కురిపించారు.