: రీమేక్ లు ఇష్టం ఉండదు.. 'కత్తి' మొదట నా దగ్గరకే వచ్చింది: మహేష్ బాబు


టాలీవుడ్ లో పెద్ద పెద్ద స్టార్లు కూడా రీమేక్ సినిమాల వైపు మొగ్గు చూపుతుంటారు. ఇతర భాషలలో హిట్టయిన సినిమా తెలుగులో కూడా ఆడుతుందనే నమ్మకంతో వారు రీమేక్ లకు ఓకే చెబుతుంటారు. అనవసరమైన రిస్క్ తీసుకోకుండా రీమేక్ లు చేస్తుంటారు. అయితే సూపర్ స్టార్ మహేష్ బాబు మాత్రం తనకు రీమేక్ సినిమాలంటే అసలు ఇష్టం ఉండదంటూ స్పష్టం చేశాడు.

ఒక సినిమాను చూసి, మళ్లీ అదే కథలో నటించడమంటే తనకు ఏమాత్రం ఉత్సాహం ఉండదని చెప్పాడు. అందుకే, రీమేక్ లు చేయకూడదని నిర్ణయించుకున్నట్టు తెలిపాడు. షూటింగ్ కు వెళ్తే అంతా కొత్తగా అనిపించాలని... అప్పుడే మనం చేస్తున్న పనిపై మనకు ఆసక్తి ఉంటుందని చెప్పాడు. రెండు, మూడు రీమేక్ సినిమాలు తన వద్దకు వచ్చినా, తిరస్కరించానని చెప్పాడు. 'కత్తి' (తెలుగులో ఖైదీ నంబర్ 150) రీమేక్ కూడా తొలుత తన వద్దకే వచ్చిందని... అయితే ఈ సినిమాకు మురుగదాస్ దర్శకత్వం వహిస్తేనే చేస్తానని చెప్పానని... అప్పుడు ఆయన హిందీలో బిజీగా ఉండటం వల్ల వీలుపడలేదని చెప్పాడు. తాజా ఇంటర్వ్యూలో మహేష్ ఈ వివరాలను వెల్లడించాడు.

  • Loading...

More Telugu News