: సొంతంగా 'ఐఫోన్ 6 ఎస్' తయారు చేశాడు... యూట్యూబ్ లో పెట్టిన ఆ వీడియో వైరల్ అయింది!
విభిన్నంగా ఆలోచించినవారే విజయం సాధిస్తారని ఒక మహానుభావుడు చెప్పినట్టు, ఒక వ్యక్తి స్పేర్ పార్ట్స్ తో యాపిల్ ఐఫోన్ 6ఎస్ మోడల్ ను తయారు చేసి ఆసక్తి రేపుతున్నాడు. దాని వివరాల్లోకి వెళ్తే... చైనాకు వెళ్లిన ఒక పాశ్చాత్యుడు... ఆ దేశంలోని ప్రముఖ మార్కెట్ అయిన షెన్జెన్ నుంచి స్పేర్ పార్ట్స్ కొనుగోలు చేసి, ఐఫోన్ 6 ఎస్ తయారు చేసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశాడు. ఇది వైరల్ అవుతోంది.
షెన్జెన్ మార్కెట్ లోని వివిధ షాపుల్లో సేకరించిన స్పేర్ పార్ట్స్ తో సరికొత్త బెస్ట్ సెల్లింగ్ ఐఫోన్ 6ఎస్ 16 జీబీ మొబైల్ ను తయారు చేశాడు. ఈ ఫోన్ స్పేర్స్ కొనుగోలు చేస్తూ, ఒక్కో స్పేర్ అమరుస్తూ తాను ఐఫోన్ 6ఎస్ ను ఎలా రూపొందించాడో చెబుతూ, ప్రాథమిక ప్రక్రియ నుంచి తుది దశ వరకు వీడియో తీసి దానిని యూట్యూబ్ లోని స్ట్రేంజ్ పార్ట్స్ ఛానల్ లో పెట్టాడు. దీంతో ఇది వైరల్ అయింది. ఆ వీడియోను మీరు కూడా చూడచ్చు...