: 'ఐఎన్ఎస్ విరాట్'ను విశాఖ తీసుకురావడంలో మరో ముందడుగు
భారత నౌకాదళంలో విశేష సేవలందించి, ఇటీవలే రిటైర్ అయిన ఐఎన్ఎస్ విరాట్ విమాన వాహక నౌకను విశాఖపట్నంకు తీసుకురావడంలో ఏపీ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. విశాఖ జిల్లా భీమిలి మండలం మూలకుద్దు వద్ద విరాట్ ను ఏర్పాటు చేసేందుకు 500 ఎకరాల స్థలాన్ని సిద్ధం చేస్తున్నారు. రాష్ట్రంలో ప్రత్యేక పర్యాటక కేంద్రంగా విరాట్ ను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. ఈ నేపథ్యంలో, ఢిల్లీలోని కేంద్ర పర్యాటక శాఖ ప్రతినిధులకు ఏపీ పర్యాటక శాఖ అధికారులు ఓ ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా కేంద్ర పర్యాటక శాఖ కొన్ని సూచనలు చేసింది. అంతేకాదు, సమగ్రమైన ప్రాజెక్టు నివేదికను తయారు చేయాలని సూచించింది. దీంతో, విరాట్ ను విశాఖకు రప్పించడంలో మరో కీలక అడుగు పడినట్టయింది.