: శాసనసభ, మండలి సంయుక్త భవనానికి మూడు నమూనాలు.. లండన్‌లో పరిశీలించిన మంత్రి నారాయణ


నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో నిర్మించనున్న శాసనసభ, మండలి సంయుక్త భవనానికి సంబంధించిన మూడు నమూనాలను మంత్రి నారాయణ పరిశీలించారు. నార్మన్ ఫోస్టర్ సంస్థ రూపొందించిన ఈ మూడు డిజైన్‌లను లండన్‌లోని ఆ సంస్థ ప్రధాన కార్యాలయంలో మంత్రి నారాయణ ఆధ్వర్యంలోని ఉన్నతస్థాయి బృందం పరిశీలించింది. మూడు నమూనాల్లో భవనాలపైనా ఈఫిల్ టవర్‌లా కనిపించే భారీ నిర్మాణం ఉండడం గమనార్హం. డిజైన్లపై మంత్రి నారాయణ సంతృప్తి వ్యక్తం చేసినట్టు సమాచారం. ముఖ్యమంత్రి చంద్రబాబుని సంప్రదించిన తర్వాత వీటిలో ఒకదానిని ఎంపిక చేస్తారు. ఇక లండన్‌లో పర్యటిస్తున్న నారాయణ బృందం పట్టణాభివృద్ధికి అనుసరిస్తున్న విధానాలపై అక్కడి అధికారులతో చర్చించింది. కాగా, నేటి (శుక్రవారం)తో బృందం పర్యటన ముగుస్తుంది.

  • Loading...

More Telugu News