: మరో ఘన విజయాన్ని ఖాతాలో వేసుకున్న షారూఖ్ సేన
కింగ్ ఖాన్ సేన ఐపీఎల్ సీజన్-10లో మరో భారీ విజయాన్ని ఖాతాలో వేసుకుంది. ఐపీఎల్ సీజన్-10లో గతంలో లేనంత దూకుడుగా ఆడుతూ షారూఖ్ ఖాన్ జట్టు విజయపరంపర కొనసాగిస్తోంది. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు కేవలం 16.4 ఓవర్లలోనే విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు 170 పరుగులు చేసింది.
అనంతరం 171 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన కోల్ కతా కు ఓపెనర్లు కెప్టెన్ గౌతమ్ గంభీర్ (72) సునీల్ నరైన్ (37) శుభారంభం ఇచ్చారు. నరైన్ అవుటైనా గంబీర్ తన దూకుడు కొనసాగించాడు. చివర్లో మనీష్ పాండే (25)తో కలిసి ఇన్నింగ్స్ ను పూర్తి చేశాడు. ఈ క్రమంలో ఐపీఎల్ లో వార్నర్ 33 అర్ధ సెంచరీల రికార్డును గంభీర్ సమం చేయడం విశేషం.