: మంత్రులుగా బాధ్యతలు స్వీకరించనున్న అఖిలప్రియ, సుజయకృష్ణ రంగారావు


ఏపీలో జరిగిన తాజా మంత్రి వర్గ విస్తరణలో స్ధానం సంపాదించిన పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిల ప్రియ, గనుల శాఖ మంత్రి సుజయకృష్ణ రంగారావు నేడు మంత్రులుగా బాధ్యతలు స్వీకరించనున్నారు. అమరావతిలో తమ కార్యాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం వారిద్దరూ బాధ్యతలు స్వీకరించనున్నారు. పలు సమీకరణాల నేపథ్యంలో ఈసారి మంత్రి వర్గంలో వారిద్దరికీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్థానం కల్పించిన సంగతి తెలిసిందే. నారా లోకేష్ తో కలిసి పలువురు మంత్రులు ఇప్పటికే పదవీ బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం వారు మీడియాతో మాట్లాడనున్నారు. 

  • Loading...

More Telugu News