: కోల్‌కతా హైకోర్టు జడ్జి కర్నన్ వివాదాస్పద ఆదేశాలు.. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌ను తన ఎదుట హాజరుపరచాలని ఆదేశం!
వివాదాస్పద ఆదేశాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే కోల్ కతా హైకోర్టు జడ్జి జస్టిస్ సీఎస్ కర్నన్ మరోమారు కలకలం రేపారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేఎస్ ఖెహర్, మరో ఆరుగురు న్యాయమూర్తులను ఏప్రిల్ 28న కోల్‌కతాలోని తన నివాసంలో హాజరుపరచాలంటూ ఆదేశాలు జారీ చేసి సంచలనం సృష్టించారు. కోర్టు ధిక్కారం కేసులో కర్నన్‌పై సుప్రీంకోర్టు ఇటీవల అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. హైకోర్టు సిట్టింగ్ జడ్జిపై అరెస్ట్ వారెంట్ జారీ చేయడం సంచలనం సృష్టించింది. ఈ నేపథ్యంలో కర్నన్ తాజా ఆదేశాలు కలకలం రేపాయి.