: ఐపీఎల్లో గంభీర్ రికార్డ్.. డేవిడ్ వార్నర్ రికార్డ్ సమం!
కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్ గౌతం గంభీర్ సరికొత్త రికార్డు సృష్టించాడు. ఈడెన్ గార్డెన్స్‌లో గురువారం కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో 49 బంతుల్లో 11 ఫోర్లతో 72 పరుగులు చేసిన గంభీర్ ఐపీఎల్లో 33వ అర్ధ శతకం నమోదు చేశాడు. ఇప్పటి వరకు హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ పేరిట ఉన్న అత్యధిక హాఫ్ సెంచరీల రికార్డును సమం చేశాడు. ఈ మ్యాచ్‌లో 171 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన నైట్ రైడర్స్ 16.4 ఓవర్లలోనే విజయం సాధించింది.