: కుటుంబ సభ్యులే క్రికెట్ బ్యాట్‌తో కొట్టి చంపేశారు.. వీడిన కానిస్టేబుల్ ఆయూబ్ హత్యకేసు మిస్టరీ
ఇటీవల జరిగిన ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ ఆయూబ్ హత్యకేసు విజయవాడలో కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఎట్టకేలకు పోలీసులు నిజానిజాలను రాబట్టారు. ఆయూబ్‌ను దారుణంగా హత్య చేసింది అతని భార్య జకీరున్నీసా, కుమార్తెలు నీలోఫర్, నాజియా, కుమారులు సద్దాం, ఇమ్రాన్లేనని డీసీపీ పాలరాజు మీడియాకు వివరించారు. ఆయనను హత్య చేసిన అనంతరం కారులో అతడి మృతదేహాన్ని తీసుకెళ్లి జక్కంపూడి వద్ద పడేశారని తెలిపారు. ఆ తరువాత కారుని కూడా పడేసి రోడ్డు ప్రమాదంగా అందరినీ నమ్మించే ప్రయత్నం చేశారని అన్నారు. ఈ కేసులో నిందితులని అరెస్టు చేసిన పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఆయూబ్ ను కుటుంబ సభ్యులే ఎందుకు చంపాల్సి వచ్చిందన్న విషయం గురించి తెలియాల్సి ఉంది.