: ‘అందరూ అడిగిన ప్రశ్నకు సమాధానం ఇదిగో’ అంటున్న క్రికెట్ దేవుడు.. ‘సచిన్’ ట్రైలర్ విడుదల
క్రికెట్ దేవుడిగా అభిమానులు పిలుచుకునే సచిన్ టెండూల్కర్ జీవితం ఆధారంగా జేమ్స్ ఎర్స్కైన్ దర్శకత్వంలో తెరకెక్కించిన ‘సచిన్: ఎ బిలియన్ డ్రీమ్స్’ ట్రైలర్‌ను ఆ చిత్ర నిర్మాణ సంస్థ కార్నివల్ మోషన్ పిక్చర్స్ విడుదల చేసింది. ఈ సినిమాకి ఏ.ఆర్. రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు. సచిన్ చిన్ననాటి సంగతులు, ఆయన క్రికెట్‌ను ఆరాధించిన తీరు, మైదానంలో తనదైన శైలిలో ప్రదర్శించిన ఆటతీరును ఈ ట్రైలర్లో చూపించారు. ఈ సందర్భంగా సచిన్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా స్పందిస్తూ.. తనను అందరూ అడిగిన ప్రశ్నకు 'సమాధానం ఇదిగో' అని పేర్కొన్నాడు. మే 26న సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోందని తెలిపాడు.
The stage is set and we are ready to begin… #SachinTrailer is out now. Here it is! https://t.co/T3oWyZw3DL
— sachin tendulkar (@sachin_rt) April 13, 2017