: ‘ఉత్తమనటుడి' అవార్డు వివాదంపై స్పందించిన అక్షయ్


ఇటీవ‌ల ప్ర‌క‌టించిన 64వ జాతీయ చ‌ల‌న‌చిత్ర అవార్డుల్లో ఉత్త‌మ‌న‌టుడిగా బాలీవుడ్ హీరో అక్ష‌య్‌కుమార్‌కి అవార్డు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. అయితే, జ్యూరీ అధిపతి ప్రియదర్శన్‌ పక్షపాతంతో వ్య‌వ‌హ‌రించి ఉత్తమ నటుడుగా అక్షయ్‌ను ప్రకటించారని ప‌లు వ‌దంతులు వ‌చ్చాయి. దీనిపై మాట్లాడిన ప్రియ‌ద‌ర్శ‌న్‌ తనతోపాటు 38 మంది జ్యూరీ సభ్యులు ఉన్నారని తెలుపుతూ అంతమంది కలిసి తీసుకున్న నిర్ణయంలో లోపం ఉందని ఎలా ప్రశ్నిస్తారని అన్నారు. అక్ష‌య్ కుమార్ అవార్డు పొందేందుకు అర్హుడ‌ని అన్నారు.

అయితే, ఈ విష‌యంపై ఇంత‌వ‌ర‌కూ స్పందించ‌ని అక్ష‌య్‌కుమార్ ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ తాను ఇండ‌స్ట్రీలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్నాన‌ని, సినిమా కోసం, అవార్డు కోసం ఏ రోజు ఎవరితోనూ సంప్రదింపులు జరపలేదని అన్నాడు. ప్రియదర్శన్ త‌న‌కు అనుకూలంగా ప్రవర్తించడానికి కారణాన్ని ఆయనే వార్తాపత్రికలతో చెప్పారని వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News