: మిర్చికి మద్దతు ధర ప్రకటించకుంటే మార్కెట్ యార్డులను ధ్వంసం చేస్తాం: సీపీఎం నేత తమ్మినేని
మిర్చికి మద్దతు ధర ప్రకటించకుంటే మార్కెట్ యార్డులను ధ్వంసం చేస్తామని తెలంగాణ రాష్ట్ర సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం హెచ్చరించారు. వరంగల్ ఏనుమాముల మార్కెట్ ను ఈ రోజు ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మిర్చి రైతులతో ఆయన మాట్లాడుతూ, మరో నాలుగు రోజుల్లో క్వింటాల్ కు మద్దతు ధర రూ.13 వేలుగా ప్రకటించకుంటే మార్కెట్ యార్డులను ధ్వంసం చేస్తామని, కోల్డ్ స్టోరేజ్ లను రైతులు ఆక్రమిస్తారని హెచ్చరించారు. కోల్డ్ స్టోరేజ్ లను ఏ వ్యాపారులు బుక్ చేసుకున్నారో వారి పేర్లను, వివరాలను ఆన్ లైన్ లో పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. జార్ఖండ్ లో క్వింటాల్ మిర్చి ధర రూ.14 వేలు పలుకుతున్న విషయాన్ని ఈ సందర్భంగా తమ్మినేని వీరభద్రం గుర్తు చేశారు.