: పాకిస్థాన్ కు వెళ్లొద్దు: తన పౌరులకు అమెరికా హెచ్చరిక


పాకిస్థాన్ లో పర్యటనకు దేశ పౌరులు ఎవరూ వెళ్లకూడదని, ఉగ్రవాదులు అమెరికన్లే లక్ష్యంగా దాడులకు తెగబడవచ్చని ట్రంప్ సర్కారు హెచ్చరించింది. పాక్ లో మైనారిటీ కమ్యూనిటీల వారిపై దైవదూషణ చట్టాలను ప్రయోగించి, కఠిన శిక్షలకు గురి చేస్తున్నారని ఆరోపించింది. ఆ దేశానికి విమానాలు నడిపే సిబ్బంది కూడా తగు జాగ్రత్తలతో ఉండాలని మైనారిటీలపై దైవదూషణ చట్టాలను సాకుగా చూపుతూ, దారుణాలకు పాల్పడుతున్నారని పేర్కొంది. విమానాలపైనా దాడులు జరగవచ్చని, ముఖ్యంగా, టేకాఫ్, ల్యాండింగ్ సమయాల్లో తక్కువ ఎత్తులో ప్రయాణించాల్సి వచ్చినప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలని ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ పేర్కొంది. తప్పనిసరైతే మాత్రమే పాక్ కు వెళ్లాలని, లేకుంటే ప్రయాణాలు పెట్టుకోవద్దని హెచ్చరించింది. కొందరు ఉగ్రవాదులు కేవలం అమెరికన్లనే లక్ష్యంగా చేసుకున్నారన్న సాక్ష్యాలు తమ వద్ద ఉన్నాయని తెలిపింది.

  • Loading...

More Telugu News