: అమెరికాలో దారుణం... తొలి ముస్లిం మహిళా జడ్జి దారుణ హత్య?
అమెరికాలో మరో దారుణం జరిగింది. దేశంలో తొలి ముస్లిం మహిళా న్యాయమూర్తిగా ఎన్నికై రికార్డు సృష్టించిన షీలా అబ్దుస్ సలామ్ (65) హడ్సన్ నదిలో విగత జీవిగా కనిపించడం కలకలం రేపింది. న్యూయార్క్ స్టేట్ అత్యున్నత న్యాయస్థానంలో అసోసియేట్ జడ్జిగా ఉన్న ఆమె హర్లీమ్ ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. నదిలో ఎవరిదో మృతదేహం తేలియాడుతోందని వచ్చిన సమాచారంపై స్పందించిన న్యూయార్క్ పోలీసులు మృతదేహాన్ని వెలికితీసి, ఆమె అబ్దుస్ సలామ్ అని గుర్తించారు. ఆమెపై దాడి జరిగిన ఆనవాళ్లు లేవని, ధరించిన బట్టలు కూడా చిరగలేదని వెల్లడించిన పోలీసులు, విచారణ జరుపుతున్నామని అన్నారు. కాగా, 2013 నుంచి న్యాయమూర్తిగా ఉన్న ఆమె, అంతకుముందు 15 సంవత్సరాలు మన్ హటన్ కోర్టులో ఫస్ట్ అపిలేట్ డివిజన్ లో సేవలందించారు.