: కేసీఆర్ వ్యాఖ్యలు సరికాదు.. కేంద్ర ప్రభుత్వాన్ని కించపరిచేలా ఉన్నాయి: కిషన్ రెడ్డి


ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లను కల్పించి తీరుతామని... దీనిపై శాసనసభలో చట్టం చేసి, కేంద్ర ప్రభుత్వానికి పంపుతామని... కేంద్రం సరిగా స్పందించకపోతే యుద్ధం తప్పదని, అవసరమైతే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేత కిషన్ రెడ్డి మండిపడ్డారు. కేసీఆర్ వ్యాఖ్యలు కేంద్ర ప్రభుత్వాన్ని కించపరిచేలా ఉన్నాయని అన్నారు.

ముస్లిం రిజర్వేషన్లపై టీఆర్ఎస్ ప్రభుత్వ వైఖరిని ఖండిస్తున్నామని చెప్పారు. ప్రజలను విభజించి పాలిస్తున్నారంటూ కేసీఆర్ పై మండిపడ్డారు. మతపరమైన రిజర్వేషన్లకు తాము పూర్తిగా వ్యతిరేకమని, కేసీఆర్ ప్రయత్నాలను అడ్డుకుని తీరుతామని చెప్పారు. అవసరమైతే అన్ని పార్టీలను కలుపుకుని ఢిల్లీలో ధర్నా చేపడతామని తెలిపారు. ముస్లిం రిజర్వేషన్ల వల్ల బీసీలకు తీరని నష్టం వాటిల్లుతుందని చెప్పారు. 

  • Loading...

More Telugu News